“Assets and More…”Democratizing investments in real estate

Alternate Currency is Future Valuable Profitable ! invest in real estate coins

మ్యాథ్స్. కొంత మందికి మాత్రమే ఇష్టమైన సబ్జెక్ట్. అధిక శాతం మంది ఈ లెక్కల చిక్కులను అంతగా ప్రేమించరు. దీన్నో బర్డెన్‌లాగా ఫీలవుతారు. అదే ఇంకొంత మంది అయితే మ్యాథ్స్‌ను ఛాలెంజ్ చేస్తారు. ప్రాబ్లంను సాల్వ్ చేసేంత వరకూ నిద్రపోరు. దాని అంతు చూడందే ప్రశాంతంగా ఉండలేరు. ఇంక ఇలా ఇష్టంతో పోరాడి మ్యాథ్స్ టీచర్ అయితే ఎలా ఉంటారో ఊహించండి. ప్రతీ సవాల్‌ను స్వీకరిస్తూ.. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పర్చుకున్నారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే యెడ్లూరి హనుమంత రావు ఉరఫ్ హను యెడ్లూరి. నర్సింహ సినిమాలో ‘జీవితమంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం’ అనే పాటలా.. ఎన్నో ఎత్తు పల్లాలను దాటుకుంటూ ఇప్పుడు తనకిష్టమైన మ్యాథ్స్‌తోనే మన జీవితాలను సులువుగా మార్చే ప్రక్రియలో ఉన్నారు. గుంటూరులోని ఎక్కడో మారుమూల ప్రాంతంలో గేదెలు కాచుకునే స్థాయి నుంచి యూఎస్‌లోని ఓ టాప్ కంపెనీలో ఉన్నత స్థాయి పదవిని అలంకరించిన వరకూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న హను యెడ్లూరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఓ ఊపు ఊపేసేందుకు నూతన కాన్సెప్ట్‌ సిద్ధం చేశారు. 

ఇంటర్ లేదా డిగ్రీ తర్వాత మనకు లెక్కలతో పని లేదని అనుకుంటాం. కానీ నిత్య జీవితంలో వాటిని అద్భుతంగా వినియోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా ఎనలిటిక్స్‌తో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సంచలన మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు హను యెడ్లూరి. ఇప్పటివరకూ రియల్ ఎస్టేట్ అనగానే తెల్లచొక్కాలేసుకుని, పెద్ద తెల్ల కారేసుకుని సైట్ దగ్గరికి వచ్చి రుబాబుగా మాట్లాడే రోజుల నుంచి ప్లాట్లను కూడా పాలిష్‌గా అమ్మేసే రోజులొచ్చేశాయి. అయితే ఆ కాన్సెప్ట్‌ను మరింతగా పాలిష్‌గా మార్చి ”అసెట్స్ అండ్ మోర్” (Assets and More) అనే ప్రాప్ టెక్ సంస్థను స్థాపించారు హను. రియల్ ఎస్టేట్‌కు టెక్నాలజీని జోడించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది హను నెలకొల్పిన ఈ సంస్థ. 

ఏంటీ అసెట్స్ అండ్ మోర్ ?
ప్రాప్ టెక్.. అనే ఈ పదం ఇండియాకు కాస్త కొత్తదిగానే చెప్పాలి. టెక్నాలజీ సాయంతో పెట్టుబడి పెట్టిన ఆస్తులను నిర్వహించడం, రిజిస్ట్రేషన్, ఇన్‌కం డిస్ట్రిబ్యూషన్, అమ్మకం – కొనుగోలు, పెట్టుబడులు వంటివాటిని చేయడమే ఓ ప్రాప్ టెక్ సంస్థ ప్రధాన లక్ష్యాలు.  ఇది విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కాన్సెప్ట్. సింపుల్‌గా చెప్పాలంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే భారీ పెట్టుబడులు ఉండాలి అనే కాన్సెప్ట్‌ను అసెట్స్ అంట్ మోర్ పూర్తిగా మార్చబోతోంది. అది ఎలా అంటే.. మీ దగ్గర రూ. 5 లక్షలు ఉన్నా చాలు… హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో మీ పెట్టుబడికి తగ్గట్టు కమర్షియల్ స్పేస్ కొనుక్కుని ఆదాయాన్ని పొందే వీలుంటుంది. రియల్ ఎస్టేట్‌ ఇన్వెస్టింగ్‌ను డెమొక్రటైజ్ చేయడమే తమ కాన్సెప్ట్ (Fractional Ownership) అంటారు హను యెడ్లూరి. తక్కువ పెట్టుబడి పెట్టే చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా రియల్ ఎస్టేట్ వృద్ధి, ప్రయోజనాన్ని అందించడం తమ ఉద్దేశమని చెప్తారు. ఇప్పుడు ఎలా అయితే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీని ఫ్రాక్షన్‌ రూపంలో (భాగాలుగా) కొంటున్నామో ఇకపై ప్రధాన నగరాల్లో భూమిని కూడా అలానే కొనే స్థితి ఉంటుందని, అందుకని చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ లాభాలను పొందే విధంగా చేశామని చెప్తారు హను. 

”ఒకప్పుడు ఆ బిల్డింగ్ మనది అనుకున్నాం. తర్వాత బిల్డింగ్‌లో ఫ్లాట్‌లో మనది అనుకుంటున్నాం. రేపు ఫ్లాట్‌లో ఓ బెడ్రూం మనది అనుకుంటాం. అలా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాక్షన్‌గా మారుతోంది. ముక్కలైపోతోంది. వందల కోట్ల పెట్టుబడుల నుంచి చిన్న వాళ్లు కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రయోజనం పొందే విధంగా పరిస్థితులను మార్పు తీసుకురావడమే మా ఉద్దేశం. ఈ టైంలో ఇన్వెస్టర్‌కు కావాల్సింది వేల్యూ, వేల్యూ అడిషన్, ఇన్‌కం, క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రమే. ప్రాపర్టీ ఎక్కడున్నా.. మనం పెట్టిన విలువకు అందుకు తగ్గట్టు విలువ వస్తోందా లేదా, దాని నుంచి ఎంత బెనిఫిట్ పొందుతున్నాం అనే చూస్తున్నారు” – హను యెడ్లూరి. 

దక్షిణాది ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంలో కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా అడుగులు వేస్తున్నాయి. ఇక్కడి ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో టైటిల్ సెక్యూరిటీపై కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో ఎదురుకాకుండా భూమి హక్కులపై క్లారిటీ ఉండడం కూడా తెలంగాణకు కలిసొస్తోంది. అది కూడా పరోక్షంగా రియల్ ఎస్టేట్ ధరలను పెంచుతోంది. ఇక్కడి నుంచి ఈ రంగంలో పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ వంటి టాప్ గ్లోబల్ బ్రాండ్ కూడా హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారబోతోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు వేల్యూ మరింతగా ఉండబోతోంది. 

సామాన్యులు కొనగలరా?
వాస్తవానికి ఇప్పుడున్న ధరలు కామన్ మ్యాన్‌కు రియల్ ఎస్టేట్‌ను బాగా దూరం చేశాయి. కనీసం రూ.75 లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటే తప్ప ఓ మంచి ప్లేస్‌లో డబుల్ బెడ్రూం ఇల్లు రావడం గగనమైపోతున్న రోజులివి. అందుకే వినియోగం కోసం ఏదో తిప్పలు పడి కొంటున్నారు కానీ.. పెట్టుబడి విషయం వచ్చే సరికి అది కుదరట్లేదు. ఎందుకంటే మన దగ్గర రూ.25 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఇదేం చిన్న మొత్తం కాదు. దీంతో.. మనం సిటీలో ఇల్లూ కొనలేం.. ఒక వేళ ఊరవతల ఎక్కడైనా తీసుకున్నా రెంట్లూ వర్కవుట్ కావు. అందుకే ఏదో ఒక చోట, ఎక్కడెక్కడో దూరంలో చిన్న చిన్న ప్లాట్లు తీసేసుకుని మనకూ ఓ భూమి ఉంది అని సరిపెట్టేసుకుంటున్నాం. అయితే అది నిజంగా ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందా అంటే..కాదు అంటారు హను. 

”ఒక ప్లాట్ మీకు డెవలపర్ అమ్మినప్పుడు తనకు కూడా ఆ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉండాలి. కేవలం ఓ క్లబ్ హౌస్, రెస్టారెంట్‌కు స్పేస్ వదిలో, కట్టిస్తేనే సరిపోదు. ఈ ప్రాపర్టీకి వేల్యూ అడిషన్ చేయాలి. దాన్ని రెసిడెన్షియల్‌గా, కమర్షియల్‌గా తీర్చిదిద్దాలి. అందుకే చిన్న వాళ్ల దగ్గర ప్రాపర్టీ కంటే.. అతిపెద్ద టౌన్‌షిప్ ఉన్న వాళ్లవైపు చూడండి. అక్కడ మీ భూమికి ఎంతగా విలువ పెరిగే అవకాశం ఉందో బేరీజు వేసుకోండి. కేవలం 80 ఫీట్ రోడ్లు, బ్లాక్ టాప్, వాటర్ ట్యాంక్, పార్క్ అనేవి పాత చింతకాయ మాటలు విని మోసపోకండి. పెద్దగా ఆలోచించండి.. పెద్ద ఆలోచనలు చేసే వాళ్లతో చేతులు కలిపి మీరూ ఇన్వెస్టర్‌గా మారండి. బయర్‌గా మిగిలిపోవద్దు”. – Hanu Yedluri

ఇంతకీ ఏంటి వీళ్ల కాన్సెప్ట్ ?
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఎలానో.. ఇక్కడా దాదాపుగా అలానే ఉంటుంది. చిన్న రిటైల్ ఇన్వెస్టర్లంతా కలిసి పెద్ద భూమిని కొంటారు. దాన్ని డెవలప్‌మెంట్‌కి ఇచ్చి కమర్షియల్, రెసిడెన్షియల్‌గా సక్సెస్ చేసి.. రెండు, మూడేళ్ల తర్వాత వచ్చే ప్రయోజనాలను సమంగా పంచుకుంటారు. ఇక్కడ భిన్నం ఏంటంటే.. భూమిని మనం ముందే కొంటాం, మన పేరు మీదే ల్యాండ్ రిజిస్టర్ చేయించుకుంటాం, దాన్ని ప్రముఖ సంస్థలకు డెవలప్మెంట్‌కు ఇస్తాం. మంచి వెంచర్‌గా, అభివృద్ధి చేసుకుని.. మళ్లీ అమ్ముకుంటాం.. లేదంటే వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటాం. ఇదీ స్థూలంగా అసెట్స్ అంట్ మోర్ చేసే పని. ఇక్కడ నేరుగా మీరే భూయజమాని నుంచి భూమిని కొంటారు.. రిజిస్టర్ చేయించుకుంటారు కాబట్టి టైటిల్ సెక్యూరిటీకి, డబ్బు భద్రత గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వీళ్లకేంటి లాభం అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. కాన్సెప్ట్, డెవలప్మెంట్, వేల్యు అడిషన్ చేసినందుకు అసెట్స్ అండ్ మోర్ కూడా పర్సంటేజ్ రూపంలో తీసుకుంటుంది. 

ఇప్పుడు హైదరాబాద్ సమీపంలో ఇలాంటి ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్‌కు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. జహీరాబాద్ NIMZ దగ్గర 600 ఎకరాల్లో అతిపెద్ద ఇంటిగ్రేడెట్ టౌన్‌షిప్, 300 ఎకరాల్లో గేటెడ్ ఫార్మ్ హౌస్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే జడ్చర్లలో 100 ఎకరాల్లో, వికారాబాద్‌ రోడ్డులో 150 ఎకరాల్లో వనభూమి ప్రాజెక్టును సక్సెస్‌ చేసే అనుభవం తమకు ఉందని చెబ్తోంది అసెట్స్ అండ్ మోర్. గత పదేళ్లుగా ఈ రంగంపై పట్టు సాధించి రాబోయే రోజుల్లో రూ.2000 కోట్ల అసెట్ మేనేజ్‌మెంట్ ప్రాప్ టెక్ కంపెనీగా తీర్చిదిద్దాలని చూస్తోంది. 

హను యెడ్లూరి తన కెరీర్‌ను మ్యాథ్స్ టీచర్‌గా మొదలుపెట్టి ఈ తర్వాత కంప్యూటర్స్ నేర్చుకుని యూఎస్‌లో క్రెడిట్ ఫెసిలిటీ, బాండ్ మార్కెట్స్, మార్టిగేజ్, వెల్త్ మేనేజ్మెంట్ రంగాల్లో మంచి పట్టు సాధించి యూఎస్‌లోని ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చి ఇన్‌స్టా ఈఎంఐ అనే ఫిన్ టెక్ సంస్థను స్ధాపించారు. ఇది వార్షికంగా సుమారు రూ.200 కోట్ల వ్యాపారాన్ని నిర్వహించింది. మొత్తంగా సుమారు రూ.800 కోట్ల పోర్ట్‌ఫోలియోలను ఈ మధ్యకాలంలో ఈ సంస్థ నిర్వహించింది. టెక్నాలజీపై ఉన్న మక్కువతో బ్రెయిన్ ల్యాబ్స్ అనే ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ స్థాపించి విద్యావ్యవస్థలో కెరీర్ బిల్డింగ్ పై అద్భుతమైన మార్గాన్ని వేలాది మంది విద్యార్థులకు సూచించారు. వివిధ యూనివర్సిటీల నుంచి బ్రెయిన్ ల్యాబ్స్‌ ఒప్పందానికి పోటీలు పడ్డాయి. ఇప్పుడు హ్యాపీ ఏఐ హోమ్స్, ప్రెడిక్టివ్ హెల్త్ కేర్ ఎనాలిసిస్, డిజి ఏఐ ల్యాబ్స్ అనే కాన్సెప్ట్స్‌పై కూడా ఫోకస్‌తో ఉన్నారు. 

”ప్రతీ ఒక్కరి జీవితంలో అజ్ఞాత వాసం, అరణ్యవాసం రెండూ ఉంటాయి. ఆ కఠిన సమయంలో గట్టిగా ఉన్నవాళ్లే నిలబడ్తారు, నిలదొక్కుకుంటారు. అలా కష్టాలను ఎదుర్కొన్నోళ్లే సక్సెస్ అవుతారు. కాడి పడేసి వెళ్లిపోయినోడు ఇక విజయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ” 

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on google
Google+

Notice: Undefined offset: 1 in /home/assetsandmore/public_html/wp-content/themes/houzez/framework/functions/helper_functions.php on line 2627

Compare listings

Compare